HomeTelugu Trending'అమ్ము' మూవీ ట్రైలర్‌

‘అమ్ము’ మూవీ ట్రైలర్‌

ammu

‘గాడ్సే’ సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది మ‌ల‌యాళ భామ ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి. ఇటీవ‌లే వ‌చ్చిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్-1లో సముద్ర‌కుమారి పాత్ర‌లో మెరిసింది ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి. ఈ బ్యూటీ టైటిల్ పాత్రలో న‌టిస్తున్న కొత్త తెలుగు చిత్రం అమ్ము.

గృహ‌హింస‌ను ఎదుర్కొంటున్న మ‌హిళ క‌థ నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి భ‌ర్త‌గా న‌వీన్ చంద్ర న‌టిస్తున్నాడు. అమెజాన్ తొలి తెలుగు ఒరిజిన‌ల్ మూవీగా వ‌స్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ తాజాగా విడుదలైంది.

ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర త‌న భార్య‌ను హింసించే పోలీసాఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు . బాబీ సింహా మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. చారుకేశ్ శేఖ‌ర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో కూడా అక్టోబ‌ర్ 19న స్ట్రీమింగ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu