HomeTelugu Trending'చిత్తం మహారాణి'... టీజర్‌

‘చిత్తం మహారాణి’… టీజర్‌

chitham maharani
యజుర్వేద్‌, రచన హీరో-హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘చిత్తం మహారాణి’. కాశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను జెఎస్‌ మణికంఠ, టీఆర్‌ ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సునీల్‌ ముఖ్య పాత్రలో నటించాడు. శనివారం ఈ సినిమా నుంచి టీజర్‌ మొదలైంది. ఇందులో హీరోయిన్‌ వెనకాల పడుతూ కనిపించాడు హీరో.

‘అయినా ఈ రోజుల్లో ప్రతివాడిదీ లవ్‌ మ్యారేజే సర్‌.. సక్సెస్‌ అయిందనుకోండి వాడి లవర్‌ని చేసుకుంటాడు, ఫెయిల్‌ అయిందనుకోండి వేరేవాడి లవర్‌ను చేసుకుంటాడు’ అని హీరో చెప్పిన డైలాగ్‌ బాగుంది. మొత్తంగా ఓ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీని తెరపై చూపించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. గౌర హరి అందించిన సంగీతం బాగుంది. ఈ మూవీకి కార్తీక్‌ శ్రీనివాస్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu