HomeTelugu Trendingనైట్‌క్లబ్‌లో హీరోయిన్‌కి నో ఎంట్రీ ఎందుకు?

నైట్‌క్లబ్‌లో హీరోయిన్‌కి నో ఎంట్రీ ఎందుకు?

15 2పునీత్ మల్హోత్రా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2’ లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్న నటి అనన్య పాండ్య. మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీకి ఫ్యాన్స్‌ కూడా అధికంగానే ఉన్నారు. తన గ్లామర్‌తో ఎంతో మంది కుర్రకారుల గుండెల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు ఓ నైట్‌ క్లబ్‌లో మాత్రం ఎంట్రీ లభించలేదు. గత వారం అనన్య తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ముంబైలోని ఓ నైట్‌ క్లబ్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. క్లబ్‌లోకి వెళ్తుంటే సిబ్బంది అడ్డుకొని బయటకు పంపించారు. కారణం ఏమిటంటే అనన్య వయసు 24 ఏళ్ల కంటే తక్కువగా ఉండడం. ఆ క్లబ్‌లో 24 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అనుమతి ఉందని, ఆ కారణంతోనే అనన్యను అనుమతి ఇవ్వలేదని క్లబ్‌ యాజమాన్యం చెబుతోంది. కాగా తన వయసు వల్లే క్లబ్‌లోకి వెళ్లలేకపోయానని అనన్య తెగ ఫీల్‌ అవుతుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu