ఎవెంజర్స్ ఎండ్ గేమ్‌పై అనసూయ సెన్సేషనల్‌ ట్వీట్‌

అనసూయ భరద్వాజ్ తెలుగు టీవీ ఇండస్ట్రీలో తిరుగులేని యాంకర్ గా కొనసాగుతూనే.. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. టీవీ సినిమాలతో బిజీగా ఉంటూ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షాకిచ్చే ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. అనసూయ ఫొటోస్ కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారంటే అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా ఎవెంజర్స్ ఎండ్ గేమ్ గురించి అనసూయ ట్వీట్ చేసింది. సినిమా తనను నిరాశ పరిచిందని ట్వీట్ చేసింది. సినిమా ఓవరాల్ గా బాగున్నా కొన్ని సన్నివేశాలు నిరాశాజనకంగా ఉన్నాయని పేర్కొంది. తనను నిరాశ పరిచినంతమాత్రానా.. తాను ఎవెంజర్స్ కు వ్యతిరేకిని కాదని చెప్పిన అనసూయ, మార్వెల్ సంస్థ నుంచి రాబోయే 21 సీరీస్ సినిమాలను చూస్తానని చెప్పింది అనసూయ. ఎవెంజర్స్ గురించి ఇలాంటి ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఇండియాలో ఎవెంజర్స్ రూ.400 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates