HomeTelugu Trendingమైఖెల్‌కి అనసూయ బర్త్‌డే విషెస్‌

మైఖెల్‌కి అనసూయ బర్త్‌డే విషెస్‌

anasuya

యాంకర్‌ అనసూయ ట్విట్టర్ వేదికగా మైఖల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇంతకీ మైఖెల్ ఎవరంటే.. మలయాళ మెగాస్టార్, మమ్ముక్క, మమ్ముట్టి. ప్రస్తుతం అనసూయ ఒక వైపు గ్లామర్ ఇమేజ్‌తోనూ, మరో వైపు వైవిధ్యమైన పాత్రలతోనూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే మలయాళ చిత్రం ‘భీష్మపర్వం’లో ఆమె నటించిన ఆలిస్ పాత్రలో నటించింది.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన చిత్రం ‘భీష్మపర్వం’. ఈ సినిమాలో మమ్ముట్టి మైఖెల్‌ పాత్రలో నటించగా.. ఆయన ప్రేయసి ఆలిస్‌గా అనసూయ నటించింది. పరిస్థితుల ప్రభావంతో వీరిద్దరికి పెళ్లి కాదు కానీ.. చివరి వరకు మైకేల్ (మమ్ముట్టి)కి ఫ్రెండ్‌గా ఆమె మిగిలిపోతుంది. ఈ సినిమాలో డీ గ్లామరైజ్డ్ రోల్ ప్లే చేసిన అనసూయ.. మమ్ముట్టితో నటించడాన్ని ఎప్పటికీ గౌరవంగా భావిస్తానని.. తెలుపుతూ.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది అనసూయ. కాగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాలో.. అనసూయ నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu