HomeTelugu Trendingహైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్..!

హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్..!

2 13హాట్‌ యాంకర్‌ అనసూయ, హైపర్ ఆది కలిసి జబర్దస్త్ చేసే కామెడీ కి చాలామంది అభిమానులు ఉన్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ భాగా వర్క్ అవుట్ అవుతుందని అభిమానులు అనుకుంటారు. ఇక ప్రస్తుతం లాక్‌డౌన్ నేపధ్యంలో సినిమా, సీరియల్ షూటింగులకు బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. దీంతో ఓటిటికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్స్‌ కూడా సినిమాల కంటే వెబ్ సిరీస్ చేయడానికి మొగ్గు చుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలు, షో లతో బిజీగా ఉండే అనసూయ కూడా ఓ వెబ్ సిరీస్‌ కు ఓకే చెప్పిందట. ఆ వెబ్ సిరీస్‌ కోసం ఈ అమ్మడు భారీగానే డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ వెబ్ సిరీస్ లో నటించడానికి హైపర్ ఆది కి కూడా ఓ అవకాశం ఇవ్వాలని ప్రొడ్యూసర్‌లను కోరినట్టు సమాచారం. కాగా ఆది కి కూడా తనతో సమానంగా పారితోషికం ఇవ్వాలని కోరిందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu