HomeTelugu Trendingఆ జెంటిల్‌ మేన్‌పై క్రష్‌ అంటున్న అనసూయ

ఆ జెంటిల్‌ మేన్‌పై క్రష్‌ అంటున్న అనసూయ

1 28
తెలుగు యాంకర్‌ అనసూయకు యూత్‌లో యమా క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కారణంగానే ఈ బ్యూటీకి యాంకరింగ్‌లోనే కాకుండా వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. ఆమె అలవాట్లు .. అభిరుచులు .. అభిప్రాయాలు .. ఇష్టాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి అనసూయ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ఒక ప్రశ్నకి ఆమె స్పందిస్తూ ..” శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్ మేన్’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి నేను యాక్షన్ కింగ్ అర్జున్ కి అభిమానిగా మారిపోయాను. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమాతో ఆయనంటే క్రష్ ఏర్పడింది. అప్పట్లో ఆయనకి నేను వీరాభిమానిని” అంటూ చెప్పుకొచ్చింది. ఆ మధ్య వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగమ్మత్త’గా మంచి మార్కులు కొట్టేసిన ఆమె, అంతే ప్రాధాన్యతను కలిగిన మరికొన్ని పాత్రలను పోషిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu