HomeTelugu Trendingఅనసూయకు 'ఖిలాడి' స్వాగతం

అనసూయకు ‘ఖిలాడి’ స్వాగతం

Anchor anasuya in ravi tejaమాస్‌ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. రమేశ్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నారు. పక్కా యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇటీవల టాలెంటెడ్ నటుడు ఉన్ని ముకుందన్ చేరారు. నేడు తెలుగు హాట్ యాంకర్ అనసూయ కూడా ఖిలాడి సెట్స్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలుకుతూ ఖిలాడి టీం పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర చేయనున్నారంట. కానీ ఆమె చేసేది ఏ పాత్ర అనేది మాత్రం క్లారిటీ లేదు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu