HomeTelugu Trendingరాజకీయాల్లోనికి రావట్లేదు: రజనీకాంత్‌

రాజకీయాల్లోనికి రావట్లేదు: రజనీకాంత్‌

Rajinikanth clarifies polit

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తాను రాజకీయాల్లోనికి రావట్లేదని మరోసారి స్పష్టం చేశారు. తాజాగా రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయ్యారు. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.

‘సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల నేను అమెరికా వెళ్లొచ్చాను. సినిమా షూటింగులు, ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల రీత్యా గత కొంతకాలం నుంచి మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సరిగ్గా సంప్రదింపులు జరపలేకపోయాను. ఈ క్రమంలోనే నేడు నిర్వాహకులందరితో సమావేశమయ్యాను. వాళ్లందరికీ నా రాజకీయ అరంగేట్రంపై ఎన్నో సందేహాలున్నాయి. భవిష్యత్తులో నేను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అని వాళ్లు నన్ను అడుగుతున్నారు. అయితే నేను రాజకీయాల్లోకి రావట్లేదు. మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తున్నాను. దాని స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రం ఏర్పాటు చేస్తున్నాను’ అని రజనీ ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu