HomeTelugu Trendingనా కొత్త షో ఇవాల్టి నుంచే.. అనసూయ ట్వీట్‌

నా కొత్త షో ఇవాల్టి నుంచే.. అనసూయ ట్వీట్‌

3 22హాట్ యాంకర్ అనసూయ.. ఇటీవలే జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేసిన మరో ఛానల్‌కు వెళ్లిపోతుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఇదే విషయంపై అనసూయ క్లారిటీ ఇచ్చేసింది. తన కొత్త షో వచ్చేస్తుందని ఓ ట్వీట్ పెట్టింది. శనివారం నుంచి రాత్రి 9 గంటలకు జీ టీవీ తెలుగులో ప్రసారం అవుతుందని అనసూయ ట్వీట్‌లో పేర్కొంది. లోకల్ గ్యాంగ్స్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది.

జబర్దస్త్‌ కార్యక్రమంతో తన కెరియర్‌కు బాట వేసుకుంది అనసూయ భరద్వాజ్. ఆ కార్యక్రమంతోనే ఆమె స్టార్ యాంకర్ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించింది. హీరోయిన్ కూడా అయింది. ఇక ఇప్పుడు ఆమె జబర్దస్త్ కామెడీ షో నుంచి తప్పుకొని మరో షోకు సిద్ధమయ్యింది. జీ తెలుగు ఛానల్‌కు వెళ్లిన అనసూయ ఇవాల్టి నుంచి తన కొత్త షో ప్రారంభమవుతుందని ట్వీట్ కూడా పెట్టింది. అనసూయతో పాటు.. జబర్దస్త్ జడ్జ్ నాగబాబు, పలు జబర్దస్త్ టీంలు కూడా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేశారు. జబర్దస్త్ కోసం అనసూయ స్థానంలో మరో యాంకర్‌ శ్రీముఖిని తీసుకొస్తున్నారు నిర్వాహకులు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu