యాంకర్ రవి కి అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలంతా రవి ఫ్యాన్సే. ఒక టీవీ షోలు.. మరోవైపు సినిమా ఈవెంట్‌లతో బిజీగా ఉండే రవి… తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇక తాజాగా తన కూతురు వియా పాడిన పాటను తన ఫేస్ బుక్‌లో తాజాగా అప్ లోడ్ చేశాడు రవి. సామజవరగమన అంటూ వచ్చి రాని మాటల్లో వియా పాడిన పాట చాలా క్యూట్‌గా అనిపించింది. చిన్నపిల్లలు సైతం ఇప్పుడే ఇదే పాటను పాడుతున్నారు. దీంతో రవి తన కూతురు ఎంతో చక్కగా ముద్దుగా పాడిన ఈ పాటన పోస్టు చేశాడు.అల్లుఅర్జున్, తమన్ సార్ థ్యాంక్యూ అంటూ వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చాడు. దీంతో రవి ఫ్యాన్స్ అంతా దీనికి లైకుల మీద లైకులు కొడుతున్నారు.
Hahahaha!! Remix of SaMaJaVaRaGaMaNa in my Baby Viya’s style…lyrics are in a different language called “Cutie Cutie” language n i hope u all will appreciate this 4yr olds singing ☺️☺️ #anchorravi_offl #baby_viya #alavaikuntapuramlo pic.twitter.com/jQJOKPTOt0
— Anchor Ravi (@anchorravi_offl) November 12, 2019













