మహేశ్‌ బాబుకి ఎయిర్‌పోర్ట్‌లో ఘోర అవమానం..

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు.. ‘భరత్ అను నేను’ సినిమా తర్వాత .. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. హీరోగా మహేశ్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ..త్రీ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు.

దిల్ రాజు, సి.అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు అల్లరి నరేష్..ఈ సినిమాలో మహేశ్‌ ఫ్రెండ్ పాత్రలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ మంచి రేటుకే అమ్ముడుపోయింది.

రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా మహర్షి షూటింగ్ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో మహేశ్‌ బాబు చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని సీన్స్ షూట్ చేయడానికి ఈ సినిమా యూనిట్‌తో పాటు మహేష్ నిన్న ఉదయమే 7.30కు ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నాడు. షూటింగ్ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ అధికారులు మహేష్‌ను అడ్డగించి ..ఢిల్లీ నుంచి అధికారుల పర్మిషన్ వచ్చేవరకు షూటింగ్ చేయెద్దని కోరారు.

ఐతే ‘మహర్షి’ యూనిట్ సినిమా షూటింగ్ నిమిత్తం పర్మిషన్స్ తీసుకున్నామని చెప్పినా వినలేదు. దీనితో మహేశ్‌ బాబు..ఎయిర్ పోర్ట్ వద్ద పార్క్ చేయబడ్డ తన వ్యాన్‌లో దాదాపు ఐదు గంటల పాటు అధికారుల పర్మిషన్ కోసం వెయిట్ చేసాడు. చివరకు అనుమతులు లభించకపోవడంతో మహేష్..వెనుదిరిగాడు. ఐతే ఎయిర్ పోర్ట్ అధికారులు మాత్రం..పుల్వామా ఎఫెక్ట్ దాడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు షూటింగ్‌ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు.