HomeTelugu Trendingసుమ వర్కౌట్‌ వీడియో వైరల్‌

సుమ వర్కౌట్‌ వీడియో వైరల్‌

Anchor suma shares her gym

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశాడు. విజయ్‌ డైరెక్షన్‌లో.. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత సుమ మళ్లీ వెండితెర రీఎంట్రీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సుమ ఫిటినెస్‌పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తోంది. అంతేగాక ఇందుకోసం తను స్పెషల్ ట్రైనర్‌ని కూడా నియమించుకుంది. తాజాగా జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న తన ఓ వీడియోను సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘2వ సెట్ డంబెల్స్ ఎత్తిన తర్వాత నా చేతులు ఎంత నొప్పిగా ఉన్నాయో వర్ణించలేను.. ఆపమంటాడేమో అని నా ట్రైనర్ రాహుల్ వైపు చూస్తూ ఉంటా.. కానీ అతను మాత్రం ఆ మాట చెప్పడు’ అంటూ సుమ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)

Recent Articles English

Gallery

Recent Articles Telugu