ట్యాక్సీ స్టీరింగ్ పట్టిన విజయ్‌ దేవరకొండ

 

“నోటా”చిత్రంతో డీలాపడ్డ విజయ్ దేవరకొండ.. “టాక్సీవాలా” అంటూ స్టీరింగ్ పట్టి రయ్ మంటూ దూసుకొస్తున్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ట్యాక్సీవాలా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. నేడు దీపావళి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఫెస్టివల్ కాన్సెప్ట్ బేస్డ్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ తన జోడీ ప్రియాంకా జవల్కర్‌తో కలిసి టపాసులు కాలుస్తూ దీపావళి పండుగ సంబరాల్లో మునిగితేలుతున్నాడు. కాగా నవంబర్ 8 ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌లో తెలిపారు.