HomeTelugu Big Storiesఅనిల్‌ రావిపూడి సక్సెస్ మంత్ర!

అనిల్‌ రావిపూడి సక్సెస్ మంత్ర!

14a
హీరోకైనా, డైరెక్టర్‌కైనా ఒక్క హిట్ గగనమైపోతుంటే.. కొందరు దర్శకులు హిట్ మీద హిట్ కొట్టేస్తున్నారు. ఫెయిల్యూర్ అనే పదానికి చోటివ్వకుండా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. లేటెస్ట్‌గా ఓ కుర్ర దర్శకుడు కూడా ఈ జాబితాలో చేరాడు. బోర్‌ కొట్టించకుండా ప్రేక్షకులను మెప్పించగలిగే ఈ ముగ్గురు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి. రచయితగా పరిచయమైన అనిల్ రావిపూడి శౌర్యం, ఆగడు, కందిరీగ, సుడిగాడు సినిమాలకు మాటలు రాశాడు.

పటాస్‌తో దర్శకుడిగా మారి కల్యాణ్‌ రామ్‌కు హిట్‌ ఇచ్చాడు. మొదటి సినిమాతో కష్టపడి హిట్‌ కొట్టడమే కాకుండా, రెండో సినిమా సుప్రీమ్‌, మూడో సినిమా రాజాది గ్రేట్‌తో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన నాలుగో మూవీ ఎఫ్‌-2 సంక్రాంతికి విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. త్వరలో రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా. అనిల్ విజయానికి కామెడీ వెన్నెముకలా నిలుస్తోంది. ఈ దర్శకుడు తీసిన 4 సినిమాల్లో రొటీన్‌ కామెడీ కాకుండా ఫ్రెష్‌ కామెడీ పుష్కలంగా కనిపిస్తుంది. అనిల్ రావిపూడి సినిమాలో కథ కంటే కథనం ఆకట్టుకుంటుంది. ఇలా ఈ కుర్ర డైరెక్టర్ సక్సెస్ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉందని చెప్పొచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu