చెర్రీ, శిరీష్ ల తరువాత బన్నీ!

హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం సినిమాలో నటిస్తోన్న అల్లు అర్జున్ మరో రెండు, మూడు వారాలు షూటింగ్ లో పాల్గొంటాడు. షూటింగ్ పూర్తయిన వెంటనే వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సినిమాను ఏయే ప్రాంతాల్లో చిత్రీకరించాలనే విషయంలో దర్శకుడు ఓ క్లారిటీకు వచ్చాడు. సినిమా మొదటి షెడ్యూల్ ను నార్త్ ఇండియాలో షూట్ చేయనున్నారు. ముఖ్యంగా కాశ్మీర్ లోని అందమైన లొకేషన్స్ లో కొన్ని సన్నివేశాలతో పాటు, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాశ్మీర్ లో మెగాహీరోల సినిమాల షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.
 
అల్లు శిరీష్ నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో ప్రారంభంలో సాగే ఎపిసోడ్ అంతా.. కాశ్మీర్ లోనే షూట్ చేశారు. ఆ తరువాత చరణ్ నటించిన ‘దృవ’ సినిమా షూటింగ్ దాదాపు నెల రోజుల పాటు కాశ్మీర్ లోనే చిత్రీకరించారు. ఇప్పుడు బన్నీ కూడా కాశ్మీర్ లొకేషన్స్ కు ఫిక్స్ అయ్యాడు. దేశభక్తి నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాకు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.