HomeTelugu Big Storiesయానిమల్‌: తెలుగు ట్రైలర్‌

యానిమల్‌: తెలుగు ట్రైలర్‌

Animal Shocking runtime locked for the Ranbir Kapoor starrerసందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ నటుడు రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం యానియల్‌. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో హీరో చిన్నప్పటి నుంచి విపరీతమైన మానసిక స్థితిని కలిగినవాడిగా కనిపిస్తున్నాడు. ముందుగా తన తండ్రిని ద్వేషిస్తూ వెళ్లిన అతను .. ఆ తరువాత తండ్రి పట్ల ప్రేమతో తాను అనుకున్న పనులు చేయడం చూపించారు. టైటిల్ కి తగినట్టుగానే హీరో వ్యవహరించడం ట్రైలర్ లో కనిపిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు .. ఎమోషనల్ డ్రామా ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది.

హీరో తండ్రిగా అనిల్ కపూర్ నటించగా, హీరో భార్య పాత్రలో రష్మిక కనిపిస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రలను బాబీ డియోల్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేశ్ ఒబెరాయ్ పోషించారు. ఈ సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలు ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత నిడివి కలిగిన బాలీవుడ్ సినిమా ఇదేనని టాక్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu