తమిళ రీమేక్ లో ప్రియదర్శి!

ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద విడుదలై ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘పెళ్ళిచూపులు’. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాలో హీరోతో పాటు ఉండే కమెడియన్ ప్రియదర్శి పోషించిన కౌశిక్ అనే పాత్ర బాగా పండింది. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘పోన్ ఒండ్రు కాందేన్’ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రియదర్శికి అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది.

‘పెళ్ళిచూపులు’ చిత్రంలో తెలంగాణ యాసలో డైలాగులు పలుకుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ప్రియదర్శి తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాడని చిత్రయూనిట్ భావిస్తోంది. ఇటీవల ‘స్పైడర్’ చిత్రం ద్వారా ప్రియదర్శి తమిళ చిత్రసీమలో అడుగు పెట్టారు. గౌతమ్ మీనన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించనుంది. అలానే విష్ణు విశాల్ హీరోగా నటించనున్నాడు. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.