HomeTelugu Big Storiesవాడ్ని త్వరలోనే పట్టుకుంటాను అంటున్న నయన్‌.. 'అంజలి సి.బి.ఐ' ట్రైలర్‌

వాడ్ని త్వరలోనే పట్టుకుంటాను అంటున్న నయన్‌.. ‘అంజలి సి.బి.ఐ’ ట్రైలర్‌

2 11స్టార్‌ హీరోయిన్‌ నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్‌ ‘ఇమైక్క నోడిగల్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అంజలి సి.బి.ఐ’ పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత సురేష్‌ దగ్గుబాటి మంగళవారం విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుందని, చిత్ర బృందానికి అభినందనలు చెప్పారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది.

‘ఈ లోకంలో జరుగుతున్న ప్రతి మంచికి, చెడుకు.. ప్రతి కదలిక వెనుక ఓ ప్రేమ ఉంది. ఆ ప్రేమ దేనిమీదైనా కలగొచ్చు.. ఐ లవ్‌ కిల్లింగ్‌..’ అంటూ విలన్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. నయనతార ఆయన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ కనిపించారు. ‘తెలివైన వాడ్ని అనుకుంటున్నాడు.. కానీ కాదు. నేను వాడ్ని త్వరలోనే పట్టుకుంటాను’ అని నయన్‌ అన్నారు. ‘బేబీ భయపడకుండా రామ్మా.. కొంచెం కూడా నీకు నొప్పి కలగకుండా ఒకేఒక్క బులెట్‌ నీ బుర్రలోకి దించేసి వెళ్లిపోతానమ్మా..’ అంటూ సైకో విలన్ చివర్లో అనడం ఆసక్తికరంగా ఉంది.

2a 1

అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అథ‌ర్వ‌, రాశీఖ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ విలన్‌గా న‌టించారు. న‌య‌న‌తార భ‌ర్త పాత్రను విజయ్‌ సేతుపతి పోషించారు. ఈ చిత్రాన్ని క్యామియో ఫిల్మ్స్ పతాకంపై సిజే జ‌య‌ కుమార్ నిర్మించారు. హిప్ హాప్ త‌మిళ‌న్ సంగీతం అందించారు. విశ్వ‌శాంతి క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాను ఫిబ్రవరి 22న తెలుగులో విడుదల చేయబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu