HomeTelugu Big StoriesHBD Allu Arjun: అల్లు వారసుడు నుండి జాతీయ ఉత్తమ నటుడిగా ఎదిగిన బన్నీ

HBD Allu Arjun: అల్లు వారసుడు నుండి జాతీయ ఉత్తమ నటుడిగా ఎదిగిన బన్నీ

allu arun HBD Allu Arjun,Allu Arjun Birthday,Tollywood,Pushpa,BunnyHBD Allu Arjun: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ బర్త్‌డే ఈ రోజు ఈ సందర్భంగా.. ఆయన బన్నీ ఐకాన్‌ స్టార్‌గా ఎలా ఎదిగాడో తెలుసుకుందా.. టాలీవుడ్‌లో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. మెగా మేనల్లుడుగా, హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడుగా, అల్లు అరవింద్‌ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.

ఆ తరువాత సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్య’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకి బన్నీ నంది స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందుకున్నాడు. దేశముదురుతో ఆయన క్రేజ్‌ మరింత పెరిగింది. తరువాత.. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ‘పరుగు’ ‘సినిమాతో ఉత్తమ నటుడిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు.

3 1 HBD Allu Arjun,Allu Arjun Birthday,Tollywood,Pushpa,Bunny

తరువాత.. ఆర్య 2, వేదం , జులాయి, రేసు గుర్రం, S/O సత్యమూర్తి , రుద్రమదేవి, సరైనోడు, DJ: దువ్వాడ జగన్నాధం, అలా వైకుంఠపురములో నటించి స్టైలీష్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు. 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బన్నీని ఐకాన్‌ స్టార్‌గా మార్చేసింది.

2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా పుష్ప నిలిచింది. ఈ సినిమాలో నటనకు బన్నీ ప్రశంసలు అందుకున్నాడు. టాలీవుడ్‌లో అత్యధిక వసూల్‌ చేసిన సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. ఈ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. తెలుగు సినిమారంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరో బన్నీ. ఆయన ఈ అవార్డును 2023 అక్టోబర్ 16న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా అందుకున్నాడు.

allu arun 2 HBD Allu Arjun,Allu Arjun Birthday,Tollywood,Pushpa,Bunny

బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఫస్ట్‌ పార్ట్‌ సూపర్‌ హిట్‌ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ కూడా ఈ మూవీపై ఓ రెంజ్‌లో హైప్స్‌ని క్రియేట్‌ చేశాయి. అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫ్యాన్స్‌ కోసం అదిరిపోయే అప్డేట్‌ రానుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఒకడు. బన్నీకి సోషల్‌ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఫేస్‌బుక్ లో సుమారు రెండు కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు. కేరళలో ఉన్న అభిమానులు అల్లు అర్జున్‌ని.. మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుస్తారు.

allu arun 1 HBD Allu Arjun,Allu Arjun Birthday,Tollywood,Pushpa,Bunny

జాతీయ ఉత్తమ నటుడి అవార్డు, జాతీయ ఉత్తమ నటుడి అవార్డు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు అనేక అవార్డులను అందుకున్నాడు. మూడు నంది అవార్డులు తో పాటు బెస్ట్‌ గా డాన్స్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే దుబాయ్‌లో టుస్సాడ్ మ్యూజియంలో మైనపు కూడా విగ్రహం ఏర్పాటు చేశారు. జర్మనీలోని ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటుడు కావడం లాంటి పలు కారణాలన్నీ ఉత్తరాదిలో బన్నీ క్రేజ్‌ను మరింత పెంచేశాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu