HomeTelugu Trendingనడిరోడ్డుపై డాన్స్‌ చేస్తా

నడిరోడ్డుపై డాన్స్‌ చేస్తా

Anjali wants dance road aft

“సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటి అంజలి. ఈ సినిమాలో ఈమో సీతగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తమిళ, తెలుగులో భాషాల్లో బిజీగా ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. అంజలి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలతో.. కుర్రకారు మతులు పోగోడుతోంది. అంజలి ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా జనజీవనం స్తంభించి పోయిన విషయం తెలిసిందే. ఇది ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన పలువురు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. నటీనటులు కూడా కరోనా దెబ్బకు ఇంటికే పరిమితం అయ్యారు. అంజలి కూడా ఇంటి పనులు, కసరత్తులు, డాన్స్‌లతో టైమ్‌పాస్‌ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె డాన్స్‌ చేస్తున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ మహమ్మారి సమస్య ముగిసిన వెంటనే బయటికి వచ్చి నడిరోడ్డుపై డాన్స్‌ చేయాలనుందని అని అంటుంది ఈ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu