HomeTelugu Trendingఅభిమాని ఫోన్‌ లాక్కొన్న అజిత్‌.. వీడియో వైరల్‌

అభిమాని ఫోన్‌ లాక్కొన్న అజిత్‌.. వీడియో వైరల్‌

Kollywood hero ajith fire o

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సామాన్యులతో సెలబ్రిటీలు పోటెత్తారు. ఈక్రమంలో హీరో అజిత్ తన ఇంటికి సమీపంలోని పోలింగ్ కేంద్రానికి తన భార్యతో కలిసి ఓటు వేయడానికి వచ్చాడు.ఈ క్రమంలో మాస్క్ లేని ఓ అభిమాని అతనితో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో హీరో అజిత్‌కు ఆ ఫ్యాన్ పై కోపం అతని చేతిలోని ఫోన్‌ను లాక్కొన్నాడు. ఆ తర్వాత భార్య శాలినీతో కలిసి ఓటు వేసిన వచ్చిన తర్వాత సదరు అభిమానికి అతని ఫోన్ తిరిగి ఇవ్వడంతో పాటు సారీ అంటూ క్షమాపణలు చెప్పాడు. ఏమైనా అభిమానులు కూడా హీరోలు కనబడగానే ఇలాంటి పనులు చేయడం కూడా కరెక్ట్ కాదంటున్నారు ఇంకొంత మంది. మొత్తంగా తమిళనాడు ఎన్నికల్లో ఇపుడు అజిత్ .. అభిమాని ఫోన్ లాక్కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్‌తో పాటు రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విజయ్ వంటి సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu