HomeTelugu Trendingనయన్‌ 'అన్నపూరణి' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

నయన్‌ ‘అన్నపూరణి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

annapoorani ott date

లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా న‌టించిన చిత్రం ‘అన్నపూరణి’. న‌య‌న్ 75వ సినిమాగా వ‌చ్చిన‌ ఈ చిత్రాన్ని ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నీలేష్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా డిసెంబ‌ర్ 01న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా విడుద‌లై నాలుగు రోజులు కూడా కాకముందే ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న‌ట్లు తెలుస్తుంది.

ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదిక‌గా డిసెంబర్ 31 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం అయితే దీనిపై మేక‌ర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార ఒక ప్రొఫెషనల్ చెఫ్‌గా మారాలనుకుంటుంది. ఈ క్ర‌మంలో త‌న‌కు ఎదురైనా స‌వాళ్లు ఎంటి.. కుటుంబం నుంచి వ‌చ్చిన ఒత్తిడిని త‌ట్టుకుని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా స్టోరీ.

సినిమాలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu