HomeTelugu Trending'దేవర'లో మరో హీరోయిన్‌!

‘దేవర’లో మరో హీరోయిన్‌!

Another heroine in Devara 1కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చకచకా జరిగిపోతోందని చెబుతున్నారు. సముద్రంతో ముడిపడి కొనసాగే కథ ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.

రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫస్టు పార్టు ముగింపు .. సెకండు పార్టు వరకూ మాట్లాడుకునేలా ఉంటుందని చెబుతున్నారు. ఫస్టు పార్టులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. డీ గ్లామర్ పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ సినిమా చివర్లో మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనుందనే టాక్ బలంగా వినిస్తోంది.

అయితే తాజాగా మరో వార్త వినిపిస్తుంది. సెకండ్ హీరోయిన్ పాత్ర సెకండ్ పార్టులోను కొనసాగుతుందని చెబుతున్నారు. ఆ పాత్ర కోసం కొంతమంది హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఆ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో .. ఎవరిని ఎంచుకుంటారో చూడాలి మరి. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu