HomeTelugu Trendingకృతిశెట్టికి మరో మెగా ఆఫర్‌!

కృతిశెట్టికి మరో మెగా ఆఫర్‌!

Another mega offer for krit

టాలీవుడ్‌లో ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే అనేక మంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. అంతేకాదు వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తాజాగా ఈ కృతి శెట్టి సాయితేజ్ జోడీగా ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

దేవ కట్టా డైరెక్షన్‌లో ‘రిపబ్లిక్’ సినిమాను పూర్తిచేసిన సాయితేజ్, ఆ తరువాత సినిమాను కార్తీక్ దండు డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఇతను కూడా సుకుమార్ శిష్యుడే. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టిని ఎంపిక చేసిన్నట్లు చెప్పుకుంటున్నారు. ‘ఉప్పెన’ సినిమా వెనుక సుకుమార్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు చేస్తున్న సినిమా కావడం వలన, కృతి శెట్టి కాదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu