HomeTelugu Trendingతల్లి కాబోతున్న సమంత.. ఫొటో వైరల్‌

తల్లి కాబోతున్న సమంత.. ఫొటో వైరల్‌

Samantha akkineni latest ph

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అక్కినేని వారి కోడలు సమంత ఫుల్‌ ఫామ్‌లో ఉంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. ఇందులో సమంత తన నటనతో అదరగొట్టింది. జూన్‌4న ప్రసారమైన ఈ వెబ్‌సిరీస్‌తో నటిగా సమంత మరింత పేరు సంపాదించింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత సినిమాల విషయంలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తుంది‌..నటనకు ప్రాధాన్యం ఉండే సినిమాలకే సై అంటుంది. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

తాజాగా సమంత తన సొంత లేబుల్‌ ‘సాకీ’ దుస్తులు ధరించి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఫొటోను షేర్‌ చేసింది. అయితే అందులో డ్రెస్‌ కంటే మామిడికాయను హైలైట్‌ చేయడంతో పలువురు నెటిజన్లు సామ్‌.. నువ్వు తల్లి కాబోతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మునుపటి కంటే సమంత కాస్త ముద్దుగా కనిపిస్తుండటంతో అక్కినేని అభిమానులకు గుడ్‌న్యూస్‌ అంటూ నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. దీంతో సమంత గర్భవతి అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలోనూ ఇటువంటి వార్తలు వచ్చిన సందర్భంలో సమంత వాటిని ఖండించింది. మరి ఈసారి సమంత స్పందిస్తుందో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Saaki (@saaki.world)

Recent Articles English

Gallery

Recent Articles Telugu