చీరతో మంచు లక్ష్మి మాస్‌ డ్యాన్స్‌

మంచు లక్ష్మి తనకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా షేర్‌ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో లో చీరకట్టుతో మాస్ డాన్స్ వేస్తూ ఉర్రూతలూగించింది. ‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ ఆ వీడియోకి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో ఆమె కూతురు విద్యా నిర్వాణ కూడా తల్లితో జతకలిసి మాస్ స్టెప్పులు వేసింది.

ఈ వీడియోపై కొంతమంది ప్రశంసలు చేస్తుంటే… మరికొంతమంది మాత్రం ఎప్పటిలాగే నెగిటివ్ కామెంట్లతో ట్రోల్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌కి ఈ వీడియో లైక్‌ కొట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

CLICK HERE!! For the aha Latest Updates