
Tollywood Drug Scandal:
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస హిట్స్ అందుకుని.. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు.. అమెన్ ప్రీత్ సింగ్ ఇప్పుడు డ్రగ్స్ కేస్ లో ఇరుక్కున్నాడు. అమన్ తో పాటు ఇంకొక నలుగురు వ్యక్తులను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
హైదరాబాద్ డ్రగ్ రాకెట్ లో పట్టుకుని అమన్ ప్రీత్ సింగ్ సహా 30 మందిని కస్టమర్లు డ్రగ్స్ జాబితాలో ఉన్నారు. తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ విభాగం 2.6 కిలోల కొకైన్‌ను.. హైదరాబాద్‌కు అమ్మకానికి తెస్తున్నారని.. తెలియడంతో పోలీసుల బృందం రంగంలోకి దిగింది. అమన్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు.
పోలీసుల ప్రకారం, ఈ డ్రగ్ రాకెట్ చాలా కాలంగా నడుస్తుంది అని, విస్తృతంగా కొకైన్ సరఫరా జరుగుతూ ఉంది అని తెలుస్తోంది. అమన్ కాకుండా డ్రగ్ రాకెట్ జాబితాలో ఉన్న మిగతా 30 మంది కస్టమర్ల వివరాలు సేకరించి, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
నిజానికి టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎప్పటినుండో నడుస్తూనే ఉంది. ఇప్పటికే పూరీ జగన్నాధ్, తరుణ్, ఛార్మి కౌర్, నవదీప్, హేమ, రవితేజ ఇలా ఎన్నో సెలెబ్రిటీల పేర్లు బయటకి వచ్చాయి. ఈమధ్యనే బెంగళూరు రేవ్ పార్టీ తర్వాత టాలివుడ్ లో డ్రగ్స్ హడావిడి మళ్ళీ మొదలైంది.
ఇప్పుడు హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త పేరు ఈ జాబితా లో బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమన్ పేరు బయటకి వచ్చింది. తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు ఇప్పుడు అమన్ పేరు లాగితే ఇంకా ఎంత మంది సెలెబ్రిటీల పేర్లు బయటకి వస్తాయో చూడాలి.













