పవన్ నుండి మరో పాట..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటుడు మాత్రం కాదు.. అతడిలో మంచి సింగర్ కూడా ఉన్నాడు. జానపద గేయాలను ఎక్కువగా ఇష్టపడే పవన్ కల్యాణ్ తను నటించిన కొన్ని సినిమాల్లో ఆ పాటలను తన గొంతుతో వినిపించాడు. ఇప్పుడు మరోసారి ఈ హీరో పాట పాడడానికి రెడీ అవుతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ తో ఓ పాట పాడించాలని భావించాడు త్రివిక్రమ్. ఈ విషయమై పవన్ తో చర్చించగా దానికి పవన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఇది కేవలం సెంటిమెంట్ కోసం త్రివిక్రమ్ చేస్తున్నాడనేది కొందరి వాదన. గతంలో పవన్ పాటలు పాడిన సినిమాలు గబ్బర్ సింగ్, అత్తారింటి దారేది పెద్ద హిట్స్ అయ్యాయి. అసలే సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. దీనికి త్రివిక్రమ్ మినహాయింపు కాదు.. అందుకే అత్తారింటికి దారేది సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నాడు. ఆ సినిమాలో నటించిన బొమన్ ఇరానీకు కూడా ఈ సినిమాలో ఓ పాత్రకు తీసుకున్నట్లు సమాచారం. అందులో అత్త సెంటిమెంట్ తో కథ నడిపించిన త్రివిక్రమ్ ఇప్పుడు సవతి తల్లి కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడు. మరి త్రివిక్రమ్ సెంటిమెంట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.. చూడాలి!