HomeTelugu Newsవరుణ్‌ తేజ్‌ సినిమాకి క్లీన్‌ 'యు'

వరుణ్‌ తేజ్‌ సినిమాకి క్లీన్‌ ‘యు’

4 14యువ నటుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తొలి తెలుగు స్పేస్‌ చిత్రం అం‍తరిక్షం. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌ వ్యోమగామిగా నటిస్తున్నాడు. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అంతరిక్షం సినిమా క్లీన్‌ యు సర్టిఫికేట్‌ సాదించింది.

ఈ సినిమా వరుణ్‌ సరసన అదితి రావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్‌ రెడ్డి, క్రిష్‌(దర్శకుడు) సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 21న రిలీజ్‌ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu