HomeTelugu Trendingఅంటే.. సుందరానికీ!.. సెన్సార్‌ పూర్తి

అంటే.. సుందరానికీ!.. సెన్సార్‌ పూర్తి

Ante sundaraniki gets a cleటాలీవుడ్‌ నేచురల్ స్టార్ నాని – నజ్రియా నజీమ్ ఫహాద్ హీరో హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ”అంటే.. సుందరానికీ!”. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. బోర్డు సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ ‘యూ’ (U) సర్టిఫికేట్ జారీ చేశారు.

ఈ సినిమా రన్ టైం 2 గంటల 56 నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాలో సీనియర్ నరేష్ – రోహిణి – శ్రీకాంత్ అయ్యంగార్ – నదియా – హర్ష వర్ధన్ – రాహుల్ రామకృష్ణ – సుహాస్ – పృథ్వీరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని – యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu