HomeTelugu Trending'అంటే .. సుందరానికీ' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

‘అంటే .. సుందరానికీ’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Ante sundaraniki movie trai
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంటే .. సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న వివేక్ ఆత్రేయ, పూర్తి వినోదపరమైన అంశాలతో రూపొందించిన సినిమా ఇది. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో నజ్రియా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ప్రకటిస్తూ, అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ నెల 2వ తేదీన వైజాగ్ – ఆంధ్ర యూనివర్సిటీలోని సీఆర్ కాన్వోకేషన్ హాల్ లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమమవుతుంది. నరేశ్ .. నదియా .. రోహిణి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu