HomeTelugu Trendingఅంటే .. సుందరానికీ: ట్రైలర్ గ్లింప్స్ విడుదల

అంటే .. సుందరానికీ: ట్రైలర్ గ్లింప్స్ విడుదల

Ante Sundaraniki Trailer Gl
నేచ్యురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే .. సుందరానికీ’. ఈ సినిమాను వచ్చేనెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా ప్రమోషన్స్ జోరును పెంచారు. తాజాగా ట్రైలర్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ, కామెడీ టచ్ తో కూడిన సీన్ పై ఈ గ్లింప్స్ ను కట్ చేశారు. ట్రైలర్ ను వచ్చేనెల 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.

వినోదప్రధానంగానే ఈ కథ నడవనుంది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నజ్రియా ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. ముఖ్యమైన పాత్రలలో నరేశ్ .. నదియా .. రోహిణి కనిపించనున్నారు. డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న నాని, ఈ సినిమా తనకి తప్పకుండా పెద్ద హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu