HomeTelugu Trending'అంటే .. సుందరానికీ' ట్రైలర్‌ విడుదల

‘అంటే .. సుందరానికీ’ ట్రైలర్‌ విడుదల

Ante Sundaraniki movie Trai

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘అంటే .. సుందరానికీ’. ఈ సినిమాలో నాని కొత్తగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నజ్రియా నజీమ్ టాలీవుడ్‌ కి పరిచయం కానుంది. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ కథలో హీరో హీరోయిన్ల కులమతాలు వేరు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వాళ్లు ఒక ప్లాన్ చేస్తారు. పర్యవసానంగా వాళ్లకి ఎదురయ్యే పరిణామాలే ఈ సినిమా. అందుకు సంబంధించిన సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu