‘డియ‌ర్ కామ్రేడ్‌’ న్యూ రిలీజ్‌ డేట్‌


సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న మరోసారి జంట‌గా న‌టిస్తోన్న సినిమా ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్’ అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శకుడు.

మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిర్మాత‌లు సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అన్నీ కార్యక్రమాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 26న విడుద‌ల చేస్తున్నారు. ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్నడ భాష‌ల్లో సినిమాను ఒకే రోజున విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వ‌చ్చింది.

CLICK HERE!! For the aha Latest Updates