HomeTelugu Trendingకార్తికేయ-2లో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు

కార్తికేయ-2లో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు

Anupam kher in karthikeya 2

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్- చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘కార్తికేయ’‌. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘కార్తికేయ 2’ మూవీ రూపొంద‌నుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌నుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

గ‌తేడాది తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వరస్వామి స‌న్నిధానంలో పూజా కార్యక్రమాల‌తో ఈ సినిమా ప్రారంభ‌మైంది. ప్రీ పొడక్షన్‌ పనులన్నీ పూర్తి చేసుకుని త్వరలోనే సెట్స్ మీద‌కి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలో మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్​ సీనియర్​ నటుడు అనుపమ్​ ఖేర్​ నటించనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈరోజు (మార్చి 7న) ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu