HomeTelugu Trending'డీజే టిల్లు' సీక్వెల్‌లో అనుపమ పరమేశ్వరణ్‌!

‘డీజే టిల్లు’ సీక్వెల్‌లో అనుపమ పరమేశ్వరణ్‌!

Anupama Parameswaran in DJ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌ నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. చిన్న విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ సంచ‌ల‌న విజ‌యం సాధించి.. సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. విమ‌ల్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన మొద‌టి షో నుండి పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. సిద్దూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఈ మూవీలో సిద్దూ న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ యూత్‌ను ఫిదా చేసింది. ఓటీటీలోనూ ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో..సీక్వెల్ పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ చిత్రంలో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌ణ్ న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇక‌ సీక్వెల్‌లో నేహా శెట్టి పాత్ర కొద్ది సేపే ఉంటుంద‌ని స‌మాచారం. దాంతో అనుప‌మ కొత్త క్యారెక్ట‌ర్‌తో ప‌రిచ‌యం కానున్న‌ట్లు టాలీవుడ్ టాక్‌. దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇక అనుప‌మ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఈ ఏడాది ‘రౌడీ బాయ్స్‌’, ”కార్తికేయ‌-2′ రెండు చిత్రాల‌తో ప్రేక్ష‌కులను ప‌లుక‌రించింది. ప్ర‌స్తుతం ఈ మ‌ల‌యాళ కుట్టి నిఖిల్‌తో ’18పేజీస్‌’ లో న‌టిస్తుంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితియార్థంలో విడుద‌ల కానుంది. దీనితో పాటుగా ‘బ‌టర్‌ఫ్లై’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టిస్తుంది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu