HomeTelugu Big StoriesTillu Square review: సిద్దు మరోసారి మ్యాజిక్ చేశాడు

Tillu Square review: సిద్దు మరోసారి మ్యాజిక్ చేశాడు

Tillu Square review:

Tillu Square review: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. ఈ సినిమా ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా తెరకెక్కింది. డీజే టిల్లు మూవీ సిద్దు జొన్నలగడ్డకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో టిల్లు.. డైలాగ్ డెలివరీ, మ్యానరిజంతో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. దీంతో టిల్లు స్క్వేర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అనుపమ హీరోయిన్‌గా నటించింది. ఈ రోజు ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ‘డీజే టిల్లు’ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా.. చూద్దాం.

టిల్లు (సిద్దు) లైఫ్ లోకి లిల్లీ (అనుపమ) వస్తుంది. ఒక పబ్‌లో ఆమె పరిచయమౌతుంది. ఆ తరువాత ఒక నెల తరువాత కనిపించి గర్భవతి అని చెప్తుంది. అప్పటికే లిల్లీ కోసం టిల్లు సైతం వెతుకుతుంటాడు. అలా సడెన్‌గా కనిపించి ప్రెగ్నంట్ అని చెప్పడంతో షాక్ అవుతాడు టిల్లు. చివరికి పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. టిల్లు బర్డ్ డేకి మళ్లీ గతంలో జరిగినట్టే షాకులు తగులుతాయి. ఆ షాకులు ఏంటి? అసలు లిల్లీ ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? మధ్యలో ఈ షేక్ మహబూబ్ (మురళీ శర్మ) ఎవరు? అనేదే కథ.

ఈ కథలో కంటెంట్‌ ఏమీ లేకపోయిన.. టిల్లు తన మ్యానరిజం, యాక్టింగ్, మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీతో మ్యాజిక్ చేస్తాడు. ఈ సినిమా మొత్తం టిల్లు, లిల్లి పాత్రలే నడిపిస్తాయి. స్పెషల్ ఫోర్స్, ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ అంటూ ఇలా పెద్ద పెద్ద డైలాగ్‌లు వాడతారు. కానీ అక్కడ అంత ఇంపాక్ట్‌గా అనిపించదు. ఎందుకంటే టిల్లుని ప్రపంచం మొత్తం మన లోకల్‌గానే చూస్తాం. ఇలాంటి లోకల్ క్యారెక్టర్ ప్రపంచంలోకి ఆ పాత్రలన్నీ వస్తాయి. ఇంటర్నేషనల్ డాన్ ఏంటి ఇంత సిల్లీగా, సింపుల్‌గా ఉన్నాడనిపిస్తుంది.

Tillu Square 2 Tillu Square review:,Siddu Jonnalagadda,Anupama Parameswaran,DJ Tillu,Tillu Square

ప్రారంభంలో హీరోయిన్‌ పాత్ర ఏంటీ ఇలా ఉంది అనిపిస్తుంది అనుకుంటాం. ఎందుకంటే మనకు హీరోయిన్ అంటే ఇలానే ఉండాలని అనే కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ చివర్లో ఆమె పాత్రలోని అసలు కోణాన్ని చూపించి ప్రేక్షకులును ఆకట్టుకుంటారు. అందుకే ఇంతలా ఓవర్‌గా చేసిందని అప్పుడు జనాలకు అర్థం అవుతుంది. ఇందులో సిద్దు చేసిన టిల్లు పాత్రతో పాటు అనుపమ చేసిన లిల్లీ పాత్రను సైతం రైటర్స్, డైరెక్టర్లు బాగానే రాసుకున్నారు. ఆమెకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అదే ఈ మూవీకి హైలెట్.

డీజే టిల్లు సీక్వెల్‌ కాబట్టి.. ఈ సీన్ తీయాలి తప్పకుండా ఉండాలి అని .. ఈ సీన్ పెట్టాలని రాసుకున్నట్టుగా ఎక్కడ అనిపించదు. ఏదో లైవ్లీగా అలా చేసుకుంటూ వెళ్లిపోయినట్టుగా అనిపిస్తుంది. సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అదే ఈ సినిమాలోని మ్యాజిక్. పైగా మధ్యమధ్యలో డీజే టిల్లు రిఫరెన్సులు తీసుకొస్తారు. అవి సినిమాను ఇంకా లేపుతాయి. ఆ సీన్లు థియేటర్లో ఆడియెన్స్ విజిల్స్ వేస్తుంటారు.

ఫస్ట్‌హాఫ్‌లో అంతా కూడా.. హీరోయిన్ పాత్ర మీద నడుస్తుంది. అయితే ఇంటర్వెల్‌కు ఓ ట్విస్ట్ ఇస్తాడు. అక్కడ అనుపమ ఎంట్రీ చూస్తే అంతా నోరెళ్లబెట్టాల్సిందే. సెకండాఫ్ కాస్త బోరింగ్‌గా, స్లోగా అనిపించినా..ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మళ్లీ పుంజుకుంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్‌లో నేహా శెట్టి ఎంట్రీ కూడా బాగుంటుంది.

Tillu Square 1 Tillu Square review:,Siddu Jonnalagadda,Anupama Parameswaran,DJ Tillu,Tillu Square

సాంకేతికంగా ఈ మూవీ అందరినీ మెప్పిస్తుంది. పాటలు థియేటర్లో దద్దరిలిపోయాయి. భీమ్స్ ఆర్ఆర్ ఈ సినిమాకు మేజర్ అస్సెట్. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. తక్కువ నిడివే కావడంతో సినిమా ఇట్టే అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

టిల్లు పాత్రలో మరోసారి సిద్దు అందరినీ నవ్విస్తాడు. టిల్లు క్యారెక్టర్‌లో సిద్దు మరోసారి మ్యాజిక్ చేశాడు. ఎంతో అవలీలగా తన క్యారెక్టర్‌ను పోషించాడు. ఇక అనుపమకు మాత్రం ఇది చాలా కొత్త క్యారెక్టర్. ఆమెకు చాలా స్కోప్‌ ఉన్న పాత్ర దక్కింది. మురళీధర్ గౌడ్ హిలేరియస్‌గా నవ్వించాడు. మార్కస్, లడ్డు పాత్రలు ఓకే. మురళీ శర్మ గెస్ట్ రోల్‌గా అనిపిస్తుంది. ప్రిన్స్ అక్కడక్కడా కనిపిస్తాడు. ఇలా అన్ని పాత్రలు కూడా తమతమ పరిధి మేరకు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu