HomeTelugu Trendingనిఖిల్‌తో అనుపమ..!

నిఖిల్‌తో అనుపమ..!

9 15యంగ్‌ హీరో నిఖిల్ ‘అర్జున్‌ సురవరం’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చాడు‌. తాజాగా ఆయన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కథ అందిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు పలనాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా నిఖిల్‌ ‘కార్తికేయ 2’ సినిమా చేయనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌, ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్టే జరిగితే వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు ఈ సినిమాలో నిఖిల్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఏడాది విడుదలైన ‘రాక్షసుడు’ చిత్రంలో బెల్లకొండ శ్రీనివాస్‌ సరసన నటించి మెప్పించింది అనుపమ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu