HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌కు జంటగా అనుష్క?

పవన్‌ కల్యాణ్‌కు జంటగా అనుష్క?

7 5

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా ఒక చారిత్రక చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆంగ్లేయుల కాలంతో ముడిపడిన కథ ఇది. ‘విరూపాక్ష’ టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం ‘కీర్తి సురేశ్’ పేరు వినిపించింది. ఆ తరువాత జాక్విలిన్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా అనుష్క పేరు వినిపిస్తోంది. గతంలో క్రిష్ డైరెక్షన్‌లో అనుష్క ‘వేదం’ సినిమా చేసింది. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. పవన్ సినిమాలో అనుష్క అయితే సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో క్రిష్ ఆమెను తీసుకున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయంపై నిజం ఎంతుంది తెలియాలంటే.. అధికారికంగా ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu