HomeTelugu Trendingతనకంటే చిన్నవాడితో అనుష్క పెళ్లి.. వైరల్‌

తనకంటే చిన్నవాడితో అనుష్క పెళ్లి.. వైరల్‌

Anushka shetty marriage wit

టాలీవుడ్‌ నటి అనుష్క పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తునే ఉన్నాయి. ప్రభాస్ తో ఆమె లవ్ లోఉందని, వారిద్దరి వివాహం జరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీటన్నింటినీ అటు అనుష్క, ఇటు ప్రభాస్ ఇద్దరూ ఖండించారు. తాము మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక తాజాగా అనుష్క పెళ్లి మరో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దుబాయ్ కి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో అనుష్క వివాహం జరుగనున్నదట. ఆ వ్యాపారవేత్త అనుష్క కన్నా వయసులో చిన్నవాడని కూడా తెలుస్తోంది.

ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే అనుష్క, ఇటీవలి కాలంలో పనిభారాన్ని తగ్గించుకుంది. తాజాగా, పెళ్లికి అంగీకరించడంతో.. ఏర్పాట్లు జరుగుతున్నాయట. కరోనా మహమ్మారి నియంత్రణలోకి వచ్చి, పరిస్థితులు చక్కబడిన తరువాత, రెండు కుటుంబాలూ కలిసి కూర్చుని మాట్లాడుకుని, వివాహానికి ముహూర్తం నిర్ణయించుకుంటారని ఫిల్మ్ నగర్ టాక్‌. ఈ విషయంలో అధికారికంగా ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.ఇందులో ఎంత నిజం ఉందో వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!