HomeTelugu Big Storiesప్రభాస్‌పై అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో వైరల్‌

ప్రభాస్‌పై అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో వైరల్‌

6 18
ప్రముఖ నటి అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతోంది స్వీటీ. ఇందులో భాగంగా ‘ఈ టీవీ’లో సుమ యాంకరింగ్‌ చేస్తున్న క్యాష్‌ ప్రోగ్రాంలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ‘మల్లెమాల’ టీమ్‌. ఈ ప్రోమోలో అనుష్క చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అనుష్క కన్నీరు పెట్టుకోవడం, ప్రభాస్‌ నా కొడుకు అనడం ..వంటి అంశాలు ఉన్నాయి. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

ఈ షోలో భాగంగా ప్రభాస్ ఫోటో చూపిస్తూ సుమ .. ఇతడి గురించి పాజిటివ్ పాయింట్ చెప్పండి అని అనుష్కని అడిగింది. దానితో అనుష్క ‘నా కొడుకు గురించా?’అని అడిగింది. దీంతో సుమ షాక్ అయి.. ‘మీ ఇద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి కదా?’ అని ప్రశ్నించింది. దీంతో ‘నా కొడుకు కదండీ?’ అంటూ అనుష్క మరోసారి పంచ్ వేసింది. దీంతో ‘అమరేంద్ర బాహుబలి’ గురించి చెప్పమంది సుమ.

‘అమరేంద్ర బాహుబలి’ క్వాలిటీసే కదా కొడుకుకు వచ్చాయి? అని అనుష్క సమాధానమిచ్చింది. ఈ ప్రోమో చివ‌ర‌లో అనుష్క క‌న్నీరు పెట్టుకోవ‌డంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సైలెంట్ అయిపోయారు. ఆమె ఎందుకు ఏడిచిందో తెలుసుకోవాలంటే ప్రోగ్రాం ప్రచారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu