నల్ల దుస్తులు ధరించిన సీఎం చంద్రబాబు

కేంద్రం తీరుకు నిరసనగా ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి చేపట్టిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా ఏపీ సీఎం చంద్రబాబు నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ సీఎం కార్యాచరణ ప్రకటించారు. విభజన చట్టం అమలులో కేంద్రం మొండిచేయి చూపిస్తున్నందున, కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నందున ఈరోజు నిరసన దినంగా పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహాయనిరాకరణకు నిరసనగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు నల్లదుస్తులు ధరించి రావాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో పలువురు సభ్యులు కూడా నల్లదుస్తులు ధరించి సభకు హాజరయ్యారు.