
AP elections 2024: మన జగన్ అన్నకు ఇంకా బ్యాండ్.. బాజావో..భారత్ షురూ అయ్యేటట్టు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు.. ఆంధ్రప్రదేశ్ లో.. తమకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ.. ఇష్టం వచ్చింది చేస్తూ.. విర్రవీగారు వైసీపీ నేతలు. ప్రజలకు ఏమన్నా పనికొచ్చే పనులు చేశారా అంటే ఏమీ లేదు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి అయ్యింది కూడా.. జగన్ చేసింది ఏమీ లేదు.. పవన్ కళ్యాణ్ ని తిట్టడం తప్ప. ప్రచారంలో అసలు అభివృద్ధి ఏమి చేస్తాం.. అని చెప్పే దానికన్నా.. పవన్ కళ్యాణ్ చేసిందేమిటి అని చెప్పడంలోనే..జగన్ ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అందుకు ఫలితంగానే రాబోయే ఎన్నికల్లో తాను ఏం చేస్తానో చెప్పకుండా.. ఊరికే పవన్ పేరుని హైలెట్ చేస్తూ వచ్చాడు.
పవన్ కళ్యాణ్ చేసిన తప్పులు ఏమీ లేవు కాబట్టి.. మాటికి ఆయన మూడు పెళ్లిళ్ల గురించి చెబుతూ.. తాను గొప్ప అని ప్రొజెక్ట్ చేసుకున్నారు జగన్. అయితే నిన్న మొన్నటి వరకు.. పవన్ కళ్యాణ్ కి ముగ్గురు పెళ్ళాలు అని చెప్పుకొచ్చిన జగన్ కి.. ఐదు సంవత్సరాల పాటు ముగ్గురు మొగోళ్ళతో వేగాల్సిన సమయం వచ్చి పడింది.
జగన్ తన చుట్టూ ఉన్న వెధవ బ్యాచ్ ని నమ్ముకొని.. మోడీని కూడా దూరం చేసుకున్నారు. ఇక చంద్రబాబు నాయుడుని.. అసెంబ్లీలో నానా మాటలు.. అని ఏడ్చే వరకు తీసుకెళ్లారు. ఆయన ఫ్యామిలీ గురించి కూడా వైసిపి నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఒకానొక సమయంలో ఆయన్ని జైల్లో కూడా కూర్చోబెట్టారు. మరో పక్క పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి పదేపదే చెబుతూ టార్గెట్ చేశారు. ఇలా మోడీ..చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్.. ముగ్గురిని తన తలకు చుట్టుకునేలా చేసుకున్నారు జగన్.
ఇక ఇప్పుడు ముగ్గురు కలిసి జగన్ కి వ్యతిరేకంగా పోటీ చేయడంతో.. ఎలక్షన్స్ లో జగన్ మెజారిటీ కాస్తా చతికిల పడిపోయింది. చంద్రబాబు నాయుడు సీఎం కావడం తథ్యం కాబట్టి.. ఇక రాబోయే ఐదు సంవత్సరాలు.. మన జగనన్న.. మోడీ.. పవన్..చంద్రబాబు అనే ముగ్గురు మొగ్గుళతో వేగవలసిన అవసరం చాలానే ఉంది.













