రోబో ‘2.ఓ’ టీజర్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా చిత్రం ‘రోబో 2.ఓ’‌. ఈ చిత్ర టీజర్‌ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. నవంబర్‌లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక్కసారిగా ఫోన్లన్నీ మాయమైపోతున్న సన్నివేశాలతో టీజర్‌ మొదలైంది. ఓ వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు ఉన్నట్టుండి లేచి చూడగానే కోట్లాది ఫోన్ల మధ్యలో ఉండడం చూసుకుని జడుసుకుంటాడు. ఆ సమయంలో పై నుంచి భీకరమైన ముఖంతో అక్షయ్‌ కుమార్‌ ఎంట్రీ అదిరిపోయింది. శంకర్‌ ముందు నుంచీ వీఎఫ్‌ఎక్స్‌ కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతోందని చెప్తున్నారు. ఆలస్యమైనప్పటికీ ఓ అద్భుతమైన టీజర్‌ను అందించారు.

ఈ చిత్రం దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఇందులో అత్యధిక భాగం వీఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే ఖర్చు చేశారు. హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 3వేల మంది నిపుణులు దీని కోసం పనిచేశారు. ఇక ప్రచారానికీ భారీగానే ఖర్చు చేస్తున్నారు