మురుగదాస్‌ కథతో త్రిష

స్టార్‌ డైరెక్టర్‌ల్లో ఒక్కరైన ఏఆర్‌ మురుగదాస్‌ రాసిన కథతో ఆయన శిష్యుడు శరవణన్‌ ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘ఎంగేయుం ఎప్పోదుం’ చిత్రంతో దర్శకుడిగా సుపరిచితమైన శరవణన్‌ ప్రమాదవశాత్తు గాయపడ్డ కారణంగా కొంతకాలం సినీ రంగానికి దూరంగా ఉన్నారు. చికిత్స అనంతరం కోలుకున్న నేపథ్యంలో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. మురుగదాస్‌ అందించే ఓ స్టోరీకి ఊపిరి పోయనున్నారు. ఈ స్టోరీతో యాక్షన్‌ సంబంధిత చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రంలో త్రిష ప్రధాన పాత్ర పోషించనున్నారు. లైకా ప్రొడెక్షన్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటుల ఎంపిక పనులు వేగంగా జరుగుతున్నాయి.