కాషాయంలో ఐసూ భ‌క్తి శ్ర‌ద్ధ‌లు!

సంద‌ర్భాన్ని బ‌ట్టి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలంటారు! ఆమాత్రం సెన్స్ మెయింటెయిన్ చేయ‌డంలో సెల‌బ్రిటీల టైమింగును మెచ్చుకుని తీరాల్సిందే. రోమ్ వెళ్లిన‌ప్పుడు రోమ‌న్‌లా, ఇండియాలో ఉన్న‌పుడు ఇండియ‌న్‌లా.. పూజాపున‌స్కారాల‌కు వెళ్లిన‌ప్పుడు పూజారుల్లా క‌నిపించ‌డం చాలా చాలా అవ‌స‌రం. 
 
ఇదిగో ఈ ఫోటో చూశాక ఆ మాట మీరే చెబుతారు. బాలీవుడ్‌ అందాల సుందరి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్ గ‌ణ‌ప‌య్య చెంత క‌నిపించిన తీరు కామ‌న్ జ‌నాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎర్ర‌ని కాషాయ చీర .. కాంబినేష‌న్  గాజులు.. నుదిటిన సింధూరం బొట్టు .. కొప్పున పూలు.. బంగారు వ‌ర్ణం మిక్సింగ్‌తో భారతీయ ఆశ్ర‌మ ధ‌ర్మం ఉట్టిపడేలా చీరలో మెరిసిపోయారు. ముంబయిలోని ప్రముఖ లాల్‌బౌగ్చా రాజా గణనాథుడిని ద‌ర్శించుకున్న వేళ ఐసూ ఈ విధంగా క‌నిపించి స‌ర్‌ప్రైజ్‌నిచ్చారు. ఐసూ వెంటే భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ విచ్చేశారు. ఐష్ ఫోటోలు ప్ర‌స్తుతం వెబ్‌లో ట్రెండింగ్‌. ఇదివ‌ర‌కూ ఓసారి ఆరాధ్య‌తో క‌లిసి ఈ దంప‌తులు గ‌ణ‌ప‌య్య‌ను సంద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.