HomeTelugu Trendingప్రభాస్ మూవీకి రెహమాన్ సంగీతం

ప్రభాస్ మూవీకి రెహమాన్ సంగీతం

Prabhas movie rehaman music

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 21వ చిత్రం తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె నటిస్తున్నట్టు తెలిసిందే. దీంతో ఈ చిత్రం రేంజ్ మరింత పెరిగింది. మరోవిశేషమేమిటంటే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే చర్చ జరుగుతోంది. ప్రతిష్ఠాత్మకమైన వైజయంతి మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పలు భాషల నుంచి ప్రముఖ నటులను ఈ సినిమా కోసం ఎంపిక చేస్తున్నారట. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu