HomeTelugu Trendingఎంగేజ్‌మెంట్ చేసుకున్న జబర్దస్త్‌ కమెడియన్‌.. ఫొటోలు వైరల్‌

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జబర్దస్త్‌ కమెడియన్‌.. ఫొటోలు వైరల్‌

11
జబర్దస్త్ కమెడియన్ పెళ్ళి పీటలెక్కబోతున్నాడు. జబర్దస్త్ షోకు చిన్న స్టేజ్ ఆర్టిస్టుగా వచ్చి.. కెమెరామెన్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ వరకు ఎదిగి ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ దుర్గారావు పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఒక్క టీమ్‌ అని కాకుండా అన్ని టీమ్స్‌లోనూ దుర్గారావు కనిపిస్తుంటాడు. వెరైటీ డైలాగ్ డెలవరీతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కమెడియన్. ముఖ్యంగా నత్తి డైలాగులతో దుర్గారావుకు మంచి ఇమేజ్ వచ్చింది. మనోడు తెలిసీ తెలియకుండా చెప్పే మాటలు.. డైలాగులు భలే నవ్వు తెప్పిస్తుంటాయి. అప్పట్లో పటాస్ ప్రకాశ్ టీమ్‌ నుంచి ఇప్పటి హైపర్ ఆది, రాకింగ్ రాకేష్ లాంటి స్కిట్స్ వరకు అన్నీ చేసాడు.

మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న దుర్గారావు మళ్లీ ఈ మధ్యే వచ్చాడు. ఇక ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా దుర్గారావు నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన ఎంగేజ్‌మెంట్ వేడుకకు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కూడా వచ్చారు. మొత్తానికి తనదైన కామెడీతో నవ్విస్తున్న దుర్గారావు.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట.

11

Recent Articles English

Gallery

Recent Articles Telugu