HomeTelugu Trendingనాని సినిమాకి ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం?

నాని సినిమాకి ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం?

2 30
నేచురల్‌ స్టార్‌ నాని టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఇప్పటికే ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వస్తున్న’వి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సుదీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత నాని కి ‘నిన్నుకోరి’ వంటి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వం లో ‘టాక్ జగదీశ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఆ మధ్య విడుదల చేసారు చిత్రబృందం. ఇక ‘టాక్సీవాలా’ సినిమాతో హిట్ అందుకున్న రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం నటీనటులను, సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేస్తున్నారు దర్శకనిర్మాతలు. కాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ పేరు వినిపిస్తుంది. ఈ సినిమాలో సంగీతం కోసం రెహమాన్ తో సంప్రదింపులు చేస్తున్నారట నిర్మాతలు ..కాగా పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమాతర్వాత రెహమాన్ తెలుగులో సంగీతం అందించలేదు. మరి నాని సినిమాకు రెహమాన్ అంగీకరిస్తాడా చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu